నా మనసును నీ మాటలు పిలిచెను..రా ఓ మావా.! నా వయసును నీ చేతలు కదిపెను..రా ఓ మావా.! ఇంటి పనిలొ హడావిడిలొ కొంగు జారె ఒక్కరోజు నా సిరులకు నీ చూపులు తగిలెను..రా ఓ మావా.! పొలం గట్లు దాటుతుంటె అడుగు జారె సంజవేళ నా సొగసులు నీ ముందర తడిసెను..రా ఓ మావా.! తొలిరాతిరి నేను రాగ గాలి వీచి దీపమార నా సిగ్గును నీ చర్యలు చెరిపెను..రా ఓ మావా.! ముడుచుకున్న కేశాలతొ ముగ్గు పెడుతె ప్రభాతంలొ నా కురులూ నీ శ్వాసకు జారెను..రా ఓ మావా.! హద్దులేవి లేవస్సలు సరసాలకు వన్నెల్లో నా విధులను నీ మనసు మరిచెను..రా ఓ మావా.! #వన్నెలయ్య_గజల్ 177 #గజల్ #తెలుగుగజల్ #మావ