1. కవితనేదో రాయమంటూ మనసు పిలిచెను చనువుగా రాతలన్నీ ఇంకిపోగా కూర్చనేమది కొత్తగా? 2. పక్కపక్కనే కలిసిమెలిసి పోయెపదములు జంటట కలతలెన్నో కలసి చూసిన కనుల జంటకు పేరేంటట? 3. ఎండుటాకులు రాలిపోగా విరిసిన నవ వసంతమా! రేపు నీవూ మరలి పోదువు! ఈ వింతలన్నీ నీ సొంతమా! 4. యేది నిజమో యేది ఊహయొ యేది నిశ్చయమో తెలుసునా? తెలుసుకున్నా పెనవేసుకున్న మమతలను దాటుట సాధ్యమా? 5. తల్లి కౌగిట తండ్రి పంచన ఎదిగినావే బాల్యమా! నివురుగప్పగ వెనుకనున్నది నిప్పొగాదో తెలుసునా? *************************************** Each stanza represents a different theme. but all of them share almost the same meter. *************************************** #amaterasutelugu #yqkavi #teluguvelugu