Nojoto: Largest Storytelling Platform

విరిగిపోయిన మనస్సు ఇప్పటికీ నిన్నే గుర్తుచేస్తుంది

విరిగిపోయిన మనస్సు ఇప్పటికీ నిన్నే గుర్తుచేస్తుంది
నీకై వెతికే నా కళ్ళు విశ్రాంతి తీస్కొనంటున్నాయి
తను కార్చే కన్నీరు ఆపలేనంటున్నాయి
ఏదో తెలియని బాధ వెంటాడుతూనే ఉంటోంది
ఆనందం పంచుకోడానికి నీ చెయ్యి, బాధను చెప్పుకోడానికి నీ బుజం తన చెంత చేరుతుందేమోననే ఆకాంక్ష తగ్గడం లేదేంటో
మనస్సులో  చెలరేగుతున్న ఘర్షణ ఎందుకో మరి పెరుగుతోంది రోజు రోజుకీ
నువ్వు చేసిన గాయం నీకు చిన్నదే అనిపించినా రోజూ నాకు గుండె కోతనే మిగులుస్తుంది
తిరిగి రావని తెలిసినా కూడా ఎక్కడో దాగి ఉన్న చిన్న ఆశ మాత్రం అలాగే ఉంది
క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా కూడా జ్ఞాపకాలు మాత్రం నా నుంచి వీడిపోనంటున్నాయి

©Jyothirmayee Mukkamala
  #lasthope
#hope #love