Nojoto: Largest Storytelling Platform

ఆమె ప్రపంచం వేరు... ఆమె ఆలోచన వేరు.., అడిగే మనిషి

ఆమె ప్రపంచం వేరు...
ఆమె ఆలోచన వేరు..,
అడిగే మనిషి లేడు,అటుగా చూసేవారు లేరు..
ఆమె ఇక పగటికలలు కనీ అలిసిపోయి పారిపోయిన ఓ మహిళ...
దానికి సమాజం కూసిన కారుకూతలు ఎన్నో...
కుదురుగా నిలబడనీయదు,స్వేచ్ఛగా మాట్లాడనీయదు 
ఆమె ఎవరో కాదు..,
ఆయన భార్య..,
బతికినంతకాలం భర్తే లోకం అని బతకమని తోసిన ఓ కుటుంబపు భారం..,
అవసరపడితే వంటిట్లో మాత్రమే,అధికారం తీసికోమని వెలివేసిన ఓ తల్లికి కూతురు..
నచ్చిన దానికై నిశిలో వెతికే ఓ చీకటి కీటకం.,
అన్నీ తెలిసినా,ఏమి తెలీనట్టు నటించే ఓ తోలుబొమ్మ..
అలిగి చేధించే ఆమె,
 ఎన్నని కొనగలదు..?
భారమైనా బయటపడితేనేనేమో ఆమెకో దారి...💢

©Reddy Awesome 
  #sadak,#women,#sadak