Nojoto: Largest Storytelling Platform

అజ్ఞానం తుడిచేసె ప్రవాహమే గీతంటే సుజ్ఞానం పంచేసే ప

అజ్ఞానం తుడిచేసె ప్రవాహమే గీతంటే
సుజ్ఞానం పంచేసే ప్రసాదమే గీతంటే

రణములోని వెనుకడుగుకు చైతన్యం రగిలించెను
సాగడమే మునుముందుకు ప్రయాణమే గీతంటే

చిగురులను చింతలను దాచిందే బ్రతుకు వనము
ఫలమునందు చెదిరిపోకు ప్రయత్నమే గీతంటే

తానెవరో మరిచిపోతె అడవి రాజు మేక క(థ)దా
నీ శక్తిని యెరుక చేయు ప్రబోధమే గీతంటే

సత్యమేదొ కనుగొనగా తపించాలి ఓ యువకా
వన్నెలయ్య కన్నుల్లో ప్రయోగమే గీతంటే #వన్నెలయ్య_గజల్ 182 #గజల్ #తెలుగుగజల్ #గీతాసారం #గీతాదినోత్సవం #Geetha #gazal #వన్నెలయ్య_భక్తి_గజల్
అజ్ఞానం తుడిచేసె ప్రవాహమే గీతంటే
సుజ్ఞానం పంచేసే ప్రసాదమే గీతంటే

రణములోని వెనుకడుగుకు చైతన్యం రగిలించెను
సాగడమే మునుముందుకు ప్రయాణమే గీతంటే

చిగురులను చింతలను దాచిందే బ్రతుకు వనము
ఫలమునందు చెదిరిపోకు ప్రయత్నమే గీతంటే

తానెవరో మరిచిపోతె అడవి రాజు మేక క(థ)దా
నీ శక్తిని యెరుక చేయు ప్రబోధమే గీతంటే

సత్యమేదొ కనుగొనగా తపించాలి ఓ యువకా
వన్నెలయ్య కన్నుల్లో ప్రయోగమే గీతంటే #వన్నెలయ్య_గజల్ 182 #గజల్ #తెలుగుగజల్ #గీతాసారం #గీతాదినోత్సవం #Geetha #gazal #వన్నెలయ్య_భక్తి_గజల్