మనసు విప్పి చెప్పనీదు నీ అంతరంగం నీ మదినెరిగి కుదురుగుండదు నా మదితరంగం ముభావంగా నువ్ విలపించినా ఆలకించగలనే నీ మౌనమృదంగం సేదతీరే తపనగా నువ్వడిగిన కమ్మని కవితకై తవ్వా నా తలపుసొరంగం యదార్థమేమిటంటే అందున అణువణువునా అంతా చీకటి చిత్రాంగం కారుచీకటి కమ్మిన నా కాటుక కనులకే కానరాలేదే ఏ దివ్వె.. బహుశా నీ,నా కధనమేదైనా యాతన తీరమొకటేనేమో.. అందుకే మదిన సంబరాన సంధించి కమ్మగ రాయదలిచిన తామసి నేనే నీ జతంటూ ఛాయల్లే చమత్కారమాడుతుంది.. కనుకే రాయలేకున్నా.. కాని ఆప్తమిత్రనై నీ మదిభారాన్ని దించుకుని నువ్ తేలిక పడేందుకు నీ వ్యధ శ్రవణానికి సిద్దంగా ఉన్నా... నువ్ మది తాళం తెరవగలిగితే..!! Cherupalli Sandhya ♡ try chesa... sis... nv adginattuga kammaga undakpovchugani Thapana theepythe undi... #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #loveqoutesbysrilathalion