మొగ్గలన్ని కుసుమాలై మురిసిపోయి నవ్వినాయి.! రాబోయే మృత్యుభీతి మరిచిపోయి బ్రతికినాయి.! భ్రమరాలను అతిధులుగా ఆదరించి - అయ్యయ్యో తమకోసం మకరందం దాచబోయి పంచినాయి.! పువ్వులాంటి హృదయాలకు పూల బాధ తెలుస్తుంది కన్నీళ్ళను మంచులోన దాచబోయి దొరికినాయి.! ఆధారం ఏ రోజున మరువలేదు పూల మనసు నేలమ్మాను ముద్దాడగ రాలిపోయి చేరినాయి.! గమ్యాలను చేరిపోతె మరణమైన జననమే వన్నెలయ్య పాదాలను చేరిపోయి మొలిచినాయి.! _______________________________________ పరిమళాల పూవులన్ని తేలిపోయి ఊగినాయి చల్లనైన గాలులతో కలిసిపోయి నడిచినాయి పుట్టినాక జతపడడం తప్పదనీ తెలుసెనేమొ.. అమ్మాయిల సిగనెక్కి మెరిసిపోయి గెలిచినాయి #వన్నెలయ్య_గజల్ 340 #వన్నెలయ్య_గజల్లు_రుబాయిలు 03 #గజల్