Nojoto: Largest Storytelling Platform

నీ పాద స్పర్శకి పువ్వులు వికసిస్తాయి నీ చూపుల తాక

నీ పాద స్పర్శకి పువ్వులు వికసిస్తాయి 
నీ చూపుల తాకిడికి వెన్నెలలు విరగబూస్తాయి 
నువ్వు నవ్వులాటకి రువ్వే నువ్వుకూడా 
నవ్య రస సృష్టికి బీజం పోస్తుంది 
నీ చుట్టొ వ్యాపించిన వలయాల శక్తి 
ప్రకృతిలో ప్రత్యేక వాతావరణానికి కారణం అవుతుంది 
నీ చుట్టూ వ్యాపించే సుగంధాల్లో సీతాకోకచిలుకలు నర్తిస్తాయి 
నీ నుంచి జారే స్వేద బిందువుల్లో తామర మొగ్గలు వికసిస్తాయి 
ప్రకృతికి పర్యాయపదం నువ్వు 
నువ్వంటే అసాధారణం 
నువ్వంటే అజరామరం 
నీ ఆలోచనలకి నాలో ఉన్న నీటి ఆవిరిఆవిరి ఘనీభవించి మేఘాలుగా మారి 
ఎడతెరిపి లేకుండా వర్షించడం మొదలుపెడుతుంది 
నీ ఉచ్చ్వాశాల ఉష్ణోగ్రతకి గడ్డకట్టిన హృదయంలోని 
రక్తం కరిగి ప్రవహించి గుండెల్లో ఆటుపోట్లకు కారణం అవుతుంది 
నా అంతరాంతరాల్లో ఆవేశపడే భావాలన్నిటికీ ఎదురు సమాధానం చెప్పగలిగింది నువ్వే 
నా నరనరాల్లో ప్రజ్వలించే అనుభూతులను అగ్నిజ్వాలలకి ఆహుతిచ్చేదీ నువ్వే 
నేను శిధిలమవుతున్నవేళ తుషారమై ఆర్తిగా తడిమేస్తావు 
నేను రాలిన పువ్వై జారిపడిన వేళ చిరుగాలివై ఎగిరే రెక్కలనిస్తావు 
లేవనుకున్నవేళ వసంతమై పూస్తావు 
ఉన్నావనుకుంటే గ్రీష్మమై వెళ్తావు 
నువ్వు మంచో చెడో కానీ నా నీడగానే ఉంటావు
అది నిజమో అబద్ధమో కానీ నీ ఉనికెప్పుడు నాలో ప్రశ్నార్ధకమే 
ఎందుకంటే నువ్వు లక్షణం ఎరుగని, కాలం తెలియని ఋతువువి

©gopi kiran
  #Telugu #write #poem