Nojoto: Largest Storytelling Platform

మేఘమంటి నల్లకాటుక దిద్ది ఉన్న కనులలో దారితప్పిన మన

మేఘమంటి నల్లకాటుక దిద్ది ఉన్న కనులలో
దారితప్పిన మనసు మాటున మాటనిప్పుడు చెప్పనా

నిలకడెరుగని మదిని దోచిన రాజహంస హొయలలో
కట్టుబడిన చిట్టి గుండె గుట్టునిప్పుడు విప్పనా

ముత్యమల్లే మెరిసిపోయే ముచ్చటైన మోమురా
కాంతినేదో దాచిపెట్టిన చలువ చంద్రుడు తన కనులురా

వెన్నెలంటి వన్నెలాడి వెన్న మనసే తనదిరా
నెమ్మదెంతో అనుకునేరు దొరకదెన్నడంతేనురా

చిలిపి చ్యేష్టల కొంటె కొమ్మ సందడంటే తానురా
అల్లరేను ఆడపిల్లకు అందమనిపించిందిరా

కోపమొస్తే కొసరుపెరుగు అందమే తన సొంతమ్మురా
అలుకబూనగ అధరంబుపైగల విసుగు దొంతర ముద్దురా! #yqkavi
#teluguvelugu
#amaterasutelugu

amaterasu9739

amaterasu

New Creator