Find the Best telugupoem Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutsad love quotes with images in telugu, there is only one happiness in this life to love and be loved meaning in telugu, telugu love quotes for her in english, love quotes for him in telugu, i love you quotes in telugu,
amaterasu
పునరపి జననం పునరపి మరణం పునరపి వృద్దా శ్రమమే శరణం ఇహ సంసారే బహుదూష్ఠారే కృపయా పారే పాహి మురారే కనిపెంచిన కన్నోళ్ళను కాదనుకున్నారు, వాళ్ళ కంట నీరు పట్టదన్నట్టున్నారు, పెంచిన తల్లి ప్రేమ కనపడని నాన్న శ్రమ, కాసుల మోజులో నేడు కలుషితముగ కనబడ్డాయి వారి ప్రేమ పలుకులు చేదులాగ వినబడ్డాయి --భరద్వాజ్ ఆర్యసోమయాజుల
కనిపెంచిన కన్నోళ్ళను కాదనుకున్నారు, వాళ్ళ కంట నీరు పట్టదన్నట్టున్నారు, పెంచిన తల్లి ప్రేమ కనపడని నాన్న శ్రమ, కాసుల మోజులో నేడు కలుషితముగ కనబడ్డాయి వారి ప్రేమ పలుకులు చేదులాగ వినబడ్డాయి --భరద్వాజ్ ఆర్యసోమయాజుల
read moreamaterasu
అరుణుని నడి సంధ్యన చూడారూ పవనికి పావనదాయి సురమణి ధాత్రికి హారపు ముత్యమువోలె నొసలందెటి సింధూరము వోలె అగుపడు ధరతిన్ #yqkavi #yqtelugu #సంధ్య #teluguvelugu #telugu #telugupoetry #telugupoem #Amaterasutelugu
#yqkavi #yqtelugu #సంధ్య #teluguvelugu #Telugu #telugupoetry #telugupoem #Amaterasutelugu
read moreamaterasu
మండే అగ్నికి అంతముండదు అనంత పవనమే దారి చూపగ అఖండాగ్నికే దారి తెలియదు మహాసంద్రమే ఎదురు నిలువగా ఎంతటి సంద్రమై ఏమి లాభము రాతిముక్కను ఓర్వలేదుగా రాయిమాత్రము శిధిలమవ్వదా శిల్పకారుని చేయినందక శిల్పకారునికి రాయి చాలునా ప్రేరణ స్ఫూర్తగు వస్తువుండక వస్తువు కన్నా సత్తువు మిన్న సత్తువు కన్నా ఙానం మిన్న ఙానం దొరకునదెక్కడరన్న ప్రకృతి ఒడిలో చూడర అన్న #telugu #telugukavi #telugupoetry #telugupoem #teluguvelugu #yqkavi #Amaterasutelugu
amaterasu
- Bharadwaj Aryasomajula #telugu #telugupoetry #telugupoem #kavita #teluguvelugu #yqkavi #Amaterasutelugu
amaterasu
మనసా ఓమాటాగు .. నీ కేరింతలెంతవరకు? అటుగా నువ్వెళ్ళె ముందు... ఒకపరి నా మాటను విను.. కలలకు కాలం చెల్లు! కళలంటే జోబుకు చిల్లు... కలిసొచ్చే మార్గమిది వెళ్ళు.. పడితే పసిడే నీ ఇల్లు.. వూహలను బలిగా పెట్టు.. వూరించే జీవితమిది ఒట్టు.. వచ్చే రాబడి చుట్టు.. వేయంతస్తుల కోటను కట్టు... ధనముండగ దిగులెందుకు నీకు.. కుప్పలుగ మణి రాశులు దొరకు.. సర్వము నీ పాదాల చెంతకు.. ఆ ఒక్కటి ఆనందాన్నడుగకు.. మనసా ఓమాటాగు .. నీ కేరింతలెంతవరకు? అటుగా నువ్వెళ్ళె ముందు... ఒకపరి నా మాటను విను.. #telugu #telugupoem #telugupoetry #kavita #teluguvelugu #yqkavi #Amaterasutelugu
amaterasu
మది లోపల అనందానికి చిహ్నం నీవే ఎద చాటున తీయని గురుతై దాగుంటావే చిరు ఆసల సవ్వడి నీవై చేరుంటావే చిర కాలం చెరగని బాసవై తోడుంటావ? పెదవంచున నా తొలి పలుకై వినిపిస్తావే మెలకువలో నా ప్రతి తలపై కవ్విస్తావే నిదురించే కనులకు కలవై కనిపిస్తావే కలకాలం కనుపాపలా నను కాస్తావా? మన మాటిక ఒక మాటగా... మన బాటిక ఒక బాటగా... మన మనసులు ఒకటవ్వగ... నన్ను కోరి నువ్వంట... నిన్ను కోరి నేనుంటా... #telugu #telugukavi #telugupoetry #kavita #telugupoem #teluguvelugu #yqkavi #Amaterasutelugu
amaterasu
ఉట్టి నుండి ఊరగాయ గట్టు మీద దింపి పెట్టి ఎర్రాని ఆవకాయ అరచేతితొ తీసిబట్టి చల్ల కుండ -- చల్లగుండ చల్దన్నం గిన్నెనెట్టి ఉప్పేసి వామేసి అరచేతడు నూనేసి రసాలూరు మామిడిని ఎడమచేతను పట్టి కలిపేసిక తింటుంటే -- అమృతము తూగుతుందా? కలిపి అమ్మ పెడుతుంటే -- ఆ కమ్మదనం దొరుకుతుందా? #telugu #telugupoetry #telugupoem #kavita #teluguvelugu #yqkavi #Amaterasutelugu
amaterasu
కనుల ఎదుట నీ రూపం చెదరగ, కనుల లోపలొక సంద్రం కదలగ, కనుల రెప్పలను కట్టను కోయగా, కనుల సాక్షిగా కదిలిన కాలపు కడలి సవ్వడై నా చెవిన చేరగా, వినిపించిన నీ రాగం మడుగున కనిపించే నీ హృదయము చూస్తూ చెదిరిన నీ రూపం మరచి స్మ్రుతి కొచిన్న నీ గ్నప్తుల తలువగా సంద్రపు ఉధ్ధతి ఎక్కువ కాగ, రెప్పలు తెరచి లోకము చూడగ, భాష్పము రాలగ చెక్కిలి మీదుగా ఆనందము పొంగెను నా యదలోనా #telugu #telugupoetry #telugupoem #kavita #teluguvelugu #yqkavi #Amaterasutelugu
amaterasu
వేకువ సూర్యుడు దిక్కులు మారుతు సంద్రం నడుమన పడిపోగా... నీలపు నింగిన చుక్కలు కలిసి తళతళమంటూ మెరవంగా... తపనుడు లేక మబ్బులనంటని జలధులు కలవర పోయెనుగా.. చంద్రుని సాయం కావాలంటూ హోరున శబ్దం చేసెనుగా.. తుంటరి గాలులు చల్లని కబురును మబ్బుల చెవిలో చెప్పంగా.. మురిసిన మేఘం అంబుధి కోసం నీటిని నేలకు పంపెనుగా.. #telugu #telugupoetry #telugupoem #kavita #teluguvelugu #yqkavi #Amaterasutelugu
amaterasu
ఆలోచనలవధులుదాటి ఆనందాల దరి చేరగ ఆ మేఘపుటంచున దాగిన చిరు నవ్వుల సిరివెన్నెలవా.. నీ వెలుగుల సొగసులు తాకగ వికసించిన కమలము నేనే.. జన్మించిన నిమిషము నుండి నీజాడకై చూస్తున్నానే... ఊపిరి పోసి ఎటుపోయావే ఊసులు కూడ వినపడవాయే ఊహలకందని జగమో ఏమొ నిజమో కలయో తెలియని మాయో #telugu #telugupoetry #telugupoem #kavita #teluguvelugu #yqkavi #Amaterasutelugu